మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల నుండి మాజీ సర్పంచ్ బానోత్ రామ్ లాల్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపుమేరకు మరిపెడ మండలం నుండి లంబాడా కళాబృందంతో ఏర్పాటు చేసిన సమావేశానికి మరిపెడ మండలం నుండిరెండు కార్లల్లో లంబాడి ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల లంబాడ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, కులాల మధ్య చిచ్చు పెడుతున్న, కుల రాజకీయాలు చేస్తున్న తెల్లం వెంకట్రావు, సోయాం బాబు రావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కుట్రప్రాయమని, బంజారా, కోయ జాతుల మధ్య విభేదాలు తేవడానికి ప్రయత్నమని విమర్శించారు. సొంత రాజకీయ లాభం కోసం అమాయక ప్రజలను మోసం చేస్తున్న వాళ్లను రాష్ట్రంలో ఉన్న లంబాడ జాతి గమనిస్తుందన్నారు,మంగళవారం జరిగే వరంగల్ శాంతి ర్యాలీకి ప్రతీ తండా నుండి వేలాదిగా తరలిరావాలని పిలుపు మేరకు మా హక్కులను మేము సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గుండెపుడి నుండి లంబాడ కళాబృందం మరిపెడ మున్సిపాలిటీ నుండి దస్రు నాయక్,భూక్య రామూర్తి నాయక్, హరీ నాయక్,రమేష్ నాయక్ తదితరులు తరలి వెళ్లారు.