లక్ష్మి నరసింహ స్వామి జాతర
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. రామచంద్ర నాయక్ కందికొండ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరిగే కందికొండ లక్ష్మీ నరసింహ స్వామి మహా జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ జాతరలో వేలాదిమంది భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సదుపాయాలు సమగ్రంగా ఉండాలని ఆయన సంబంధిత శాఖాధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు, ఈ సందర్భంగా డా. రామచంద్ర నాయక్ మాట్లాడుతూ –జాతరలో భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. తాగునీరు, విద్యుత్, పారిశుధ్య, వైద్యసేవలు, రవాణా, పార్కింగ్ వంటి అన్ని సదుపాయాలు సమన్వయంతో సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి అని సూచించారు, ప్రతి సంవత్సరం జరిగే కందికొండ లక్ష్మీ నరసింహ స్వామి జాతర తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. భక్తుల భక్తి భావాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలి అని అన్నారు,జాతర ప్రాంతంలో రహదారి మరమ్మతులు, లైటింగ్, డ్రైనేజ్, నీటి సదుపాయాలు, తాత్కాలిక షెడ్లు వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు, కార్యక్రమంలో ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్,మాజీ జెడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి,సిరోలు మండల కాంగ్రెస్ నాయకులు వేణు,తొర్రూరు మార్కెట్ వైస్ చైర్మన్ బట్టు నాయక్,స్థానిక ఎస్సై సంతోష్,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.