లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్,జఫర్గఢ్ ఆధ్వర్యంలో జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి(జి)గ్రామంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మామిడాల పూర్ణచందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ అంచురి యుగంధర్,ట్రెజరర్ మెరుగు బాలరాజు పాల్గొనగా,దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూరపాటి రాజు నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు దాంశెట్టి సోమేశ్వర్,రొడ్డ రాజు,ఎర్ర నరేష్,శ్రవణ్ కుమార్,చిట్టి మల్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.అలాగే గ్రామ ఉపసర్పంచ్ ముక్కెర గంగరాజు,ఎండి మునీర్,గాదే అంబేద్కర్,కాసిర బోయిన రాజు,మునిగే ఎల్లస్వామితో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.