క్షీరాభిషేకం
తెలుగు గళం స్టేషన్గన్పూర్ న్యూస్
చిల్పూర్, అక్టోబరు 26
స్టేషనఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని లింగంపల్లిలో ఆదివారం గ్రామశాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఎమ్మెల్యే కడియంశ్రీహరి, ఎంపీ కావ్య ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధిపథంలో ముందడుగు వేస్తుందని ఈసందర్భంగా చిన్న పెండ్యాల నుండి తరిగొప్పుల వరకు, రూ.46.03 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కడియం శ్రీహరి కృషి చేస్తున్నారన్నారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చిల్పూర్ మండల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఊరడి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కంకటి నరేందర్, మాజీ సర్పంచ్ ఎదునూరి రవీందర్, ఉప సర్పంచ్ కంకటి రాజన్న ముఖ్యనాయకులు, తుత్తురు రాజు, మండల్ బీసీ సెల్ అధ్యక్షులు కండ్లకోలు బాలరాజు,మాజీ గ్రామశాఖ అధ్యక్షులు యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.