
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 20
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని హోటల్ నిర్వాహకుల సంఘం సభ్యులు శుక్రవారం రోజు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) డి.ఎస్. వెంకన్నకు మెమోరాండం సమర్పించారు. ప్రస్తుతం వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో పాటు పెరుగుతున్న ధరల కారణంగా హోటల్ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారిందని వారు వివరించారు.హోటళ్లలో రోజువారీగా పెద్ద మొత్తంలో గ్యాస్ అవసరం ఉండటంతో, సరైన సమయానికి సిలిండర్లు అందకపోవడం వల్ల కస్టమర్లకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ సమస్య కారణంగా చిన్నచిన్న హోటళ్లు ఆర్థికంగా నష్టపోతున్నాయని, కొంతమంది నిర్వాహకులు వ్యాపారం మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని హోటల్ రంగానికి అవసరమైన వంటగ్యాస్ సిలిండర్లను నిరంతరంగా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రత్యేక కోటా కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. అలాగే ధరలను నియంత్రించి హోటల్ నిర్వాహకులకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఆర్డీఓ వెంకన్న వారి వినతిని స్వీకరించి, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రెడ్డి మెస్ హోటల్ నిర్వాహకులు మరియు ఇతర హోటల్ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.