వడ్లకొండలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఘనంగా ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ డెక్క సునీత – కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, దేశాన్ని పోలియో రహితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఏం సుమలత,ఆశ వర్కర్స్ వి.లక్ష్మి ,వి. స్వప్న, అంగన్వాడీ టీచర్ కె. లక్ష్మి, ఆయాలు,గ్రామపంచాయతి,సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.