
ఈ69న్యూస్ వరంగల్ : పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు షాప్ తాళం తిప్పి లోపలకి చొరబడ్డారు. వీరు షాప్లో ఉన్న రూ.51,000 నగదుతో పాటు రూ.33,400 విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.