ఈ69న్యూస్ వరంగల్:నగరంలో ట్రాఫిక్ సమస్యలను సమీక్షించేందుకు అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్ & ట్రాఫిక్) రాయల ప్రభాకర్ రావు బుధవారం ఎంజీఎం జంక్షన్, పోచమ్మ జంక్షన్, వరంగల్ చౌరస్తా,హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లను సందర్శించారు.ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎంజీఎం జంక్షన్లో ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న పాత సిగ్నల్ పోల్స్‌ను తొలగించాలని, పోచమ్మ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ కోన్స్ ఏర్పాటు చేయాలని,వరంగల్ చౌరస్తాలో ఓపెన్ మ్యాన్‌హోల్ సమస్యను GWMC దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ బూత్‌ను తొలగించాలని ఆదేశించారు.ట్రాఫిక్ సిబ్బంది చురుకుగా పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.