
వరంగల్ మండల కార్యాలయం ముందు ఎంసిపిఐ(యు) ధర్నా
ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి మాలోతు సాగర్,నగర సహాయ కార్యదర్శి చుంచు జగదీశ్వర్ మాట్లాడుతూ..తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.6 గ్యారంటీ సంక్షేమ పథకాలు వరంగల్ మండల పరిధిలో అనేక కుటుంబాలకు అందడం లేదని తెలిపారు.అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు మంజూరు కాకపోవడం,ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు పట్టాలు రాకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాల గుడిసెలు నీటమునిగాయని కొన్ని ఇండ్లు కూలిపోయి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.రైతులకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారిందని,అప్పులు తెచ్చి పంటలు వేసిన రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని తక్షణమే యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద లక్ష రూపాయల నగదు,ఒక తులం బంగారం వంటి హామీలు అమలు కావడం లేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక సమస్యలు-ఇందిరమ్మ ఇండ్లు,పట్టాలు,పెన్షన్లు,రోడ్లు,డ్రైనేజీ,కరెంటు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ ధర్నాకు కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి పరమేళ్ల గోవర్ధన్ రాజు అధ్యక్షత వహించారు.అనంతరం మండల తహసీల్దార్ ఇక్బాల్ కి సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎండి మహబూబ్ పాషా,ఐతం నగేష్,పోలేపాక రవీందర్,కె.రఘుపతి,శేఖర్,కీర్తి శ్రీనివాస్,ఎండి రసీద్,లత,ఎస్.కె.అజీమ్ అహ్మద్,ఎండి హైమద్,ఎస్డి ఆదామ్,ఎండి ఇర్ఫాన్,ఎండి హబీబ్,ఎస్డి అన్వర్,ఎండి షబీర్,ఎండి అజీర్,ఎండి హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.