
ఈ69న్యూస్ జనగామ:- వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.సమావేశంలో కాశ్మీర్ ఘటనలో మరణించినవారికి నివాళులర్పించారు.రజతోత్సవ సభకు అంచనాలకు మించి 30 వేల మంది హాజరయ్యారని తెలిపారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు.కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.