
వరంగల్ హన్మకొండజిల్లాలో పలు చోట్ల వర్షాలు
ఈ69న్యూస్:హన్మకొండ,వరంగల్ ప్రజలు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు.ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో ప్రధాన రహదారులు జలమయం కాగా,ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు సమాచారం.స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.వర్షం ధాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.