NPRD ఆధ్వర్యంలో RTC X రోడ్లో బిల్లు ప్రతులు దగ్ధం
#NPRD ఆధ్వర్యంలో #RTC X రోడ్లో బిల్లు ప్రతులు దగ్ధం
డిసెంబర్ 30, 31తేదీల్లో జిల్లా కేంద్రాల్లో బిల్లు పత్రాల దగ్ధం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (#MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (VB-GRAMG బిల్లు) వికలాంగుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్రఅధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి యం అడివయ్య హేచ్చరించారు.
ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో #RTC x రోడ్ వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబి-జి రామ్ జిబిల్లు పత్రాలను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగులకు 150 ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించెందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందని అన్నారు.దేశ వ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం కింద ఉపాధి కల్పించబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగ కార్మికులకు జీవనోపాధిని మరింతగా కోల్పోయేలా చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగుల ను తీవ్రమైన పేదరికంలోకి నేడుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో… మందికి పని కల్పించరానిఅన్నారు. నరేగా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపు 90:10 గా ఉందని, కొత్త బిల్లు ప్రకారం 60:40 శాతంగా నిధులు కేటాయించి ఖర్చు చేయాలని పేర్కొనడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక భారం మొపేదిగా ఉందని అన్నారు. కొత్త చట్టం ప్రకారం వికలాంగులకు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.చట్ట బద్ధంగా పని కల్పించాలని చట్టం ఉన్నప్పుడే వికలాంగులకు నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వ్యవస్థలు మరియు పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన వికలాంగులలో పని చేసే వారి సంఖ్య తీవ్రంగా తగ్గిందని అన్నారు.
ఈ బిల్లు 125 రోజుల పనిని అందిస్తుందనే వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని అన్నారు. ఉద్దేశపూర్వక నిధుల కొరత కారణంగా సగటున ఉపాధి 50 రోజుల కంటే తక్కువగా ఉందని అన్నారు.వికలాంగులను ఉపాధికి అర్హులైన కార్మికులుగా, సామర్థ్యం ప్రకారం పని చేయడానికి మరియు జీవనోపాధి రక్షణకు చట్టబద్ధంగా గుర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన #VB-G RAM G బిల్లు వికలాంగుల హక్కును బలహీనపరుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగుల జీవనోపాధి, గౌరవం మరియు మనుగడకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా విబి- జి రామ్ జి బిల్లు ఉందని అన్నారు.కొత్త చట్టం ప్రకారం జాబ్ కార్డ్స్ జారీ చేయడం, పని హక్కుగా ఉపాది వంటి అంశాల వలన రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వలన వికలాంగులకు అందుబాటులో ఉండే పని దొరికే అవకాశం లేకుండా పోతుందని అన్నారు.ఉపాధి హామీ పథకం సంక్షేమ పథకం కాదని, దేశంలో సామాజిక న్యాయాన్ని చట్ట బద్దంగా అమలు చేసిన ఒక్క చట్టమనే విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం గమనించాలని అన్నారు. కొత్త చట్టంలో పని హక్కుకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.వికలాంగుల జీవనోపాదిని దెబ్బతిసే విదంగా ఉన్న విబి జి రామ్ జి బిల్లు పత్రాలను డిసెంబర్ 30, 31తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు ఉపేందర్, కాషాప్ప, మధుబాబు, అరిఫా, సహాయ కార్యదర్శులు జెర్కొని రాజు,నాగలక్ష్మి,బాలిశ్వర్,రాష్ట్ర కమిటీ సభ్యులు కవిత,బాలయ్య,భుజంగారెడ్డి, చంద్రమోహన్, చందు,భాగ్యలక్ష్మి, షైన్ బేగం, ప్రకాష్, లలిత, దుర్గ, కుర్మయ్య,పార్వతి తదితరులు పాల్గొన్నారు