TELUGU POET
స్వార్ధమే -మీ
అంతరార్థమైతే
ప్రజాసేవలోకి
మీరు రావద్దు!
మీలాంటివారివల్లే
సామాన్యులు
నష్టపోయారు!
పోతూనే ఉన్నారు!
ధనం కోసమూ
కీర్తి కోసమూ
ప్రజాసేవను
వాడుకుంటే
మీకుమిగిలేవి
గుండె జబ్బులే!
కులాలు మతాలు
గొప్పనుకోవద్దు!
వాటిసృష్టి అంతా
స్వార్ధ నిర్మాణమే!
మీ మేధస్సును
నిస్వార్ధంగా
సమాజానికి
అర్పించండి!
పంచభూతాలు
ఇవ్వటమే కాని
తిరిగి ఆశించవు!
అందుకే అవి
చిర స్థాయి!
ఏ చెట్టుకు
మరో చెట్టుతో
వివక్షలు లేవు!
ఇచ్చే ఫలాలు
ఇస్తూనేవుంటాయి!
ప్రజా సేవ
అలా ఉండాలి!
ఆనాడే ఆ సేవకు
శాశ్వత స్థానం!
ప్రకృతిని చూస్తే
మీకే తెలుస్తుంది!
మీరెంత స్వార్ధ
వికృతసేవకులో!
ప్రకృతి సేవ
ప్రమోదం
వికృతసేవ
ప్రమాదం!
**
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్