
విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను మరియు ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం రోజున పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 8వేల కోట్లపై చిలుకు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే అక్కడ యజమాన్యాలు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. గత నెల రోజుల క్రితం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి 1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ను మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. లేదంటే రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్, రేణుకుట్ల పవన్ కుమార్, రాహుల్ సాయికుమార్, మేఘన, భవాని, అనూష,ప్రవళిక, రాధిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.