విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మరిపెడ మండలం బురహాన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోట వెంకటరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని పదిమందికి ఉపయోగపడే చదువుని చదువుకోవాలని పది మందికి ఆదర్శంగా నిలవాలి అని మీరు మీకు కావాల్సినటువంటి చదువుకు మౌలిక సదుపాయాలు పాఠ్యపుస్తకాలు ఇతర సామాగ్రి ఏదైనా కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు చదువుకు కావలసిన సామాగ్రి అందచేస్తానని మన గ్రామం తరపు నుండి మీరు మన గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని ఒక కలెక్టర్, ఐపీఎస్, లుగా మీరు ఎదగాలని నేను ఆశిస్తున్నానని కోట వెంకటరెడ్డి అన్నారు అనంతరం వెంకట్ రెడ్డి మనుమడు, అద్విత్ రెడ్డి తండ్రి సందీప్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు గ్రామ స్కూల్ లో పిల్లలకు స్కూల్ బాగ్స్ పుస్తకాలు పంపిణి చేయండి జరిగింది అన్నారు,ఈ కార్యక్రమంలో కోట గోపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి -శ్రేయ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ గడ్డం జోగిరెడ్డి, జాగటి.వెంకటయ్య, సూత్రపు పద్మ-వెంకన్న, గడ్డం.మోహన్ రెడ్డి, వీరారెడ్డి, కోట మధుసూదన్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,రమేష్ రెడ్డి, వీరారెడ్డి,వెంకట్ రెడ్డి, నలబోలు సత్తిరెడ్డి, యుఎస్ఎఫ్ఐ వీరబాబు గుగ్గిళ్ల. పుల్లయ్య, జంపెల్లి కొమురయ్య(జూనియర్ రెవంత్), పోలేపంగు. వెంకన్న,నాగు, బోడియా,తిరుపయ్య, సూత్రపు. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.