విద్యార్థులు చదువులపై దృష్టి సారించాలి-కొత్తపల్లి గోరి ఎస్సై సాకపురం దివ్య
Uncategorized

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
సమాజంలో ఎందరో వ్యక్తులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తూ జీవితంలో తన లక్ష్యం వైపు నిరంతరం అడుగులు వేయాలని కొత్తపల్లి గోరి ఎస్సై సాకపురం దివ్య అన్నారు. వివరాలలోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సై విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, గుట్కా, డ్రైవింగ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విద్య కీలకపాత్ర పోషిస్తుందనీ, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకొని తల్లిదండ్రులకు,తాము చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్ఐ విద్యార్థులను కోరారు. విద్యార్థులు మాదకదవ్యాలు, మత్తు పదార్థాలకు, గుట్కాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల అనేకమంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఎస్సై విద్యార్థులకు వివరించారు.అలాగే విద్యార్థులు టు వీలర్ డ్రైవింగ్ చేయకూడదని, ఒకవేళ చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని సూచించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు చదువులో మొదటి స్థానంలో వచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తానని ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సైని హెచ్ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అనంతరం జగ్గయ్యపేట గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయగా దీనికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి గోరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ దివ్య పాల్గొన్నారు.దీనికి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జి వెంకట్ నారాయణ ఆప్టికల్స్ వారిచే పరీక్షలు చేసినారు. 170 మంది కంటి పరీక్షలు చేయగా ఇందులో 45 మందికి కంటి పొరలు వచ్చినందున వీరికి ఉచిత కంటి ఆపరేషన్ చేస్తారు. ఎస్సై గ్రామస్తులు ఉద్దేశించి ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ సిబ్బంది సహకారం తీసుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వై గోపాలకృష్ణారెడ్డి, ప్రజ్వెల్ పి యు మేనేజర్ కళ్యాణ్ ఎఫ్ ఎఫ్ మటికే గణేష్ మరియు తోటకూర సుజాత,గ్రామస్తులు పొనుగంటి వీరబ్రహ్మం,ముడుపు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.