
విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: ఆర్.సి.ఓ అరుణ కుమారి
మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ను ఉమ్మడి నల్గొండ జిల్లా రిజియన్ కో- ఆర్డినేటర్ అరుణ కుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల లోని డైనింగ్ హల్, డార్మెంటరీ, క్రీడా మైదానం ను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, వారికి నాణ్యమైన విద్యను అందించి మెరుగైన ఫలితాలు సాదించాలని సూచించారు. టీమ్ వర్క్ చేసి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.టీచింగ్ డైరీ లు, లెస్సన్ ప్లాన్ అప్డేట్ లో ఉండాలని, మైక్రో షెడ్యూల్ అమలు పరచాలన్నారు. తరగతి గదులలో టీఎల్ఎం ఉపయోగించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, సులభ పద్ధతి లో విద్యాబోధన చేయాలని సూచించారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేయడం పట్ల వారిని ఆర్.సి.ఓ అభినందించ క్రమబద్ధీకరణ విషయంలో ప్రత్యేక చొరవ చూపిన ఉపాధ్యాయురాలు రజిని ని ఆమె సన్మానించారు. ఐక్యతతో అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని ఆమె అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ ధన విజయలక్ష్మి,వైస్ ప్రిన్సిపాల్ వసంత,రేణుక, వెంకటేశ్వర్లు, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.