విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం.. పీఎం పోషణ పథకంపై ప్రత్యేక శిక్షణ
పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన,పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం పోషణ (మధ్యాహ్న భోజన) పథకంపై ధర్మసాగర్ మండలంలో ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ధర్మసాగర్ బాలుర జెడ్పీహెచ్ఎస్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రతి పాఠశాల నుండి ఒక కుక్-కమ్-హెల్పర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మసాగర్ మండల విద్యాధికారి డా. రామ్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అత్యంత కీలకమని పేర్కొన్నారు.భోజన తయారీ ప్రక్రియలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని,ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.జెడ్పీహెచ్ఎస్ బాలుర ధర్మసాగర్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కె.బి. ధర్మప్రకాశ్ శిక్షణ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ,మధ్యాహ్న భోజన తయారీలో పాటించాల్సిన “చేయవలసినవి – చేయకూడనివి” అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఆహార భద్రత, పరిశుభ్రత, పోషక విలువలు, వంటశాల నిర్వహణ వంటి అంశాలపై పాల్గొనేవారికి వివరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ బాలికల ధర్మసాగర్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గణేష్, జెడ్పీహెచ్ఎస్ దేవునూర్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి,స్కూల్ కాంప్లెక్స్ సహాయ కార్యదర్శి స్వర్ణలత పాల్గొన్నారు.స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్లు శిక్షణలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు