 
                                                      
                                                విద్యుత్ షాక్తో రైతు మృతి
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్ గ్రామంలో శనివారం ఉదయం జరిగిన విషాద ఘటన స్థానికులను కుదిపేసింది.రైతు కోట వాసు (42) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.గ్రామస్థుల సమాచారం ప్రకారం,వాసు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా విద్యుత్ వైర్ తెగి పడటంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.మృతుడి కుటుంబసభ్యులు,బంధువులు మరియు గ్రామస్థులు కలిసి స్టేషన్ ఘనపూర్ సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా లైన్మెన్,ఏఈ,డీఈ ఎవరూ విచారణకు రాలేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామస్తులు విద్యుత్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయింపు చేపట్టారు.దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.వాసు కుటుంబానికి న్యాయం చేయకపోతే భీష్మించుకుని కూర్చుంటాం అని గ్రామస్థులు హెచ్చరిక జారీ చేశారు.
 
         
         
         
         
        