విపత్తు తగ్గింపు దినోత్సవం పై అవగాహన సదస్సు
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మరియు సుపరిండెంట్ బానోతు దేవిలాల్ ఆదేశాల మేరకు,జనగాం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నందు విక్టరీ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మై భారత్ యూత్ కోఆర్డినేటర్ కామ రాము మాట్లాడుతూ..ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 13ను ‘అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దినోత్సవం’గా ప్రకటించింది.2002లో మరో తీర్మానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించారు”అని తెలిపారు.అలాగే,ఆయన మాట్లాడుతూ ప్రతి భారత పౌరుడు విపత్తు నిర్వహణ,నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని సూచించారు.భవిష్యత్తులో సంభవించే విపత్తులను తట్టుకునే సామర్థ్యంతో ముందుకు సాగే సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,కానిస్టేబుల్ సంతోష్,విద్యార్థులు మరియు విక్టరీ బాయ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.