వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే
Jangaon, Telanganaవీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పేర్కొన్నారుమండలంలోని కునూరు గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజానాట్యమండలి కళాకారులు డప్పచప్పులతో ఎర్రజెండాలు చేతబట్టి గ్రామ పురవీధుల గుండా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ పాటలు పాడుకుంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు
కునూరు బస్టాండ్ సెంటర్లో సిపిఎం పార్టీ జెండాను పార్టీ గ్రామ కార్యదర్శి శాగ యాదగిరి ఆవిష్కరించారు.ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు నెల్లుట్ల మోహన్ రావు అచ్చమాంబ దంపతులు ఓరుగంటి మల్లయ్య మోడెం జగన్నాథం వారు చేసినటువంటి త్యాగాలు నేటి తరానికి తెలియపరిచేందుకు వారి కుటుంబ సభ్యులైనా నెల్లుట్ల అజయ్,ఓరుగంటి లక్ష్మీ ,ముప్పిడి పద్మ లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాలువలు కప్పి సన్మానించడం జరిగింది.అనంతరం ఏర్పాటు చేసిన సభకు సిపిఎం పార్టీ నాయకులు రాయపురం బిక్షపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ..వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిన పోరాట యోధులను అవమానపర్చే బీజేపీ మతోన్మాద శక్తుల కుట్రాలను ఎండగట్టాలని కమ్యూనిస్టు శ్రేణులకు రాపర్తి రాజు పిలుపునిచ్చారు.భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా ఉద్యమాలలోసీపీఎం ముందుకు పోతున్నాదని అన్నారు.నిజాం నిరంకుశ పాలను ఎదిరించి రజాకారులకు ముచ్చెమటలు పట్టించి నీ బాంచన్ కాల్మొక్త దొర అనే బానిసత్వాన్ని ఎదిరించి తిరగబడిన గొప్ప వీరులను కన్నా ప్రాంతం మనదని అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో నాలుగు వేలమంది అమరులైనరని ,10 లక్షల ఎకరాల భూమిని పంచి,పేదప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండాది అన్నారు.ఇంతటి చరిత్రను వక్రీకరిస్తూ బిజెపి హిందువులకు ముస్లింలకు జరిగిన చరిత్ర అంటూ పక్కదారి పట్టిస్తున్నారని సాయుధ పోరాట చరిత్ర గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని వారు అన్నారు.కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామ గ్రామాన జరపాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనెల 17న జనగామలో.వీర తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల భారీ బహిరంగ సభ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నదని ఈ బహిరంగ సభకు సిపిఎం అఖిలభారత కార్యదర్శి కామ్రేడ్ యంఏ బేబీ గారు హాజరవుతున్నారని ఈ బహిరంగ సభ కు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది హాజరు కావాలని కోరారు.
సిపిఎం లో పలువురు చేరిక
పేద ప్రజల కోసం నిరంతరం పోరాడే సిపిఎం పార్టీలో కునూరు గ్రామానికి చెందిన షేక్ మున్వర్ కొండేటి రవీందర్ ఇల్లందుల సంపత్ సోడెం సంపత్ కొంతమంది సిపిఎం పార్టీ జిల్లా నాయకుల సమక్షంలో చేరారు చేరిన వారికి సీపీఎం పార్టీ కండువాలు కప్పి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి షబానా పార్టీ మండల కార్యదర్శి గుండెబోయిన రాజు మండల కమిటీ సభ్యులు కాటా సుధాకర్ ముక్కెర గంగరాజు నక్క యాకయ్య వడ్లకొండ సుధాకర్ రాపర్తి రజిత పార్టీ ప్రజాసంఘాల మండల గ్రామ నాయకులు సకినాల కొమురయ్య శాగ శ్రీనివాస్ ఎండీ శంసొద్దిన్ ఏ ప్రభాకర్ అంబటి యాదగిరి వేల్పుల పెద్ద రాములు సాకి నరసింగం చిరంజీవి నక్క సారయ్య రాపర్తి లక్ష్మి పులిగిల్ల రవి ఎర్రోళ్ల బాబు అనుమాల కనకయ్య ఓరుగంటి కుమార్ దొంతూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.