వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలో ఉన్న ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడెల్లి నియాన్స్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.రామవరం గ్రామానికి చెందిన ఎడెల్లి మహేందర్ (జిహెచ్ఎంసీ) చిన్న కుమారుడు ఎడెల్లి నియాన్స్ జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,విద్యావేత్తలు,ప్రజాప్రతినిధులు తమ పిల్లల పుట్టినరోజులను విలాసవంతంగా ఖర్చు చేయడం కంటే వృద్ధులు,అనాధలు నివసించే ఆశ్రమాల్లో జరుపుకోవడం ద్వారా సమాజానికి గొప్ప సందేశం ఇవ్వవచ్చన్నారు.అవసరం లేని ఖర్చులకన్నా అవసరంలో ఉన్నవారి కడుపు నింపితే మానవత్వానికి నిజమైన అర్థం చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామవరం గ్రామ నూతన సర్పంచ్ గిరాగాని క్రాంతి కుమార్ వృద్ధులను పరామర్శించి,వారికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.అలాగే త్వరలో తన జన్మదినాన్ని కూడా వృద్ధాశ్రమంలోనే జరుపుకుంటానని ప్రకటించారు.కార్యక్రమంలో భాగంగా మహేందర్ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడంతో పాటు పండ్లు,బియ్యం బస్తాలు పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించిన సర్పంచ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసన్న కుమార్ మహేందర్ కుటుంబాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ప్రతినిధులు,రామవరం గ్రామ సర్పంచ్,ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.