వృద్ధుల భద్రతకు భరోసా
సీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల భద్రత,అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మ హెల్పింగ్ హాండ్స్ సహకారంతో విలువైన వస్తువులు భద్రపరచుకునేందుకు ఉపయోగపడే ఇనుప పెట్టెలను శనివారం పంపిణీ చేశారు.వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సుమారు 15 మంది వృద్ధులకు తమ ముఖ్యమైన పత్రాలు, డబ్బు తదితర విలువైన వస్తువులను సురక్షితంగా దాచుకునేందుకు సరైన ఏర్పాట్లు లేవని గుర్తించిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ ఈ విషయాన్ని మహాత్మ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు గంట రవీందర్ దృష్టికి తీసుకెళ్లారు.అడిగిన వెంటనే స్పందించిన గంట రవీందర్ తన సొంత ఖర్చులతో ఇనుప పెట్టెలను ఏర్పాటు చేసి వృద్ధాశ్రమానికి అందించడం విశేషంగా నిలిచింది.ఆయన సేవా భావానికి గుర్తుగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు ఆశ్రమానికి చేరుకొని వృద్ధులకు పెట్టెలను అందజేశారు.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..“మా గురువు గారైన గంట రవీందర్ గారి సేవా ప్రేరణతోనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఏర్పడింది.ఆయన మానవత్వం,సేవా తత్వమే మా సంస్థకు మార్గదర్శకం.వృద్ధుల భద్రత కోసం చేసిన ఈ సహాయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది”అని తెలిపారు.అలాగే వృద్ధులు కూడా తమ అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన మహాత్మ హెల్పింగ్ హాండ్స్, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.