ఈ69న్యూస్ న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క వయోజన శాఖ మజ్లిస్ అన్సారుల్లాహ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి స్థానిక వయోజన సమితి అధ్యక్షుడు ముహమ్మద్ గుంషావలీ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన సమితి అధ్యక్షుడు(నాజిం అన్సారుల్లాహ్)ముహమ్మద్ సలీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఈ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఆగస్టు 10వ తేదీన జరగబోయే జిల్లా స్థాయి ఇజ్తిమా సమావేశం ఏర్పాట్లపై చర్చించారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఈ ఇజ్తిమా కార్యక్రమాలలో ప్రతి (అన్సార్) వయోజన సభ్యుడు క్రియాశీలంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అలాగే స్థానిక స్థాయిలో కూడా ఇలాంటి ఇజ్తిమా సమావేశం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు మహబూబ్ అలీ సాహెబ్,మౌల్వీ యాకూబ్ కుర్రం సాహెబ్,చందా ఇన్స్పెక్టర్ ముబీన్ అహ్మద్,ఉస్మాన్ సాహెబ్,అక్బర్,అంకూస్,అజారుద్దీన్,నజీరుద్దీన్,యాకూబ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.సభ ముగింపు సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేశారు.