ఎస్సై దివ్య ను సన్మానిస్తున్న కమిటీ సభ్యులు ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడిని స్థానిక కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ నిర్వాహకులు గ్రామస్తులకు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ… ప్రజలందరి ఐక్యతతో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలు గ్రామస్తుల ఐక్యతకు, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు.అందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ,విజయవంతం చేయాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ఎస్సై దివ్య కు కమిటీ మహిళా సభ్యులు చిరిపోతుల లక్ష్మీ,బిళ్ల రజిత,పనాస రమ, కానిగంటి రమ,కసుబోసుల జ్యోతి, పంచగిరి వనమాల తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు.