వెలిశాల అనాధ ఆశ్రమానికి ట్రంక్ పెట్టెల పంపిణీ
వెలిశాల గ్రామంలో ఉన్న అనాధ ఆశ్రమంలో నివసిస్తున్న అనాధ పిల్లలు తమ విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకునే ఉద్దేశంతో అవసరమైన ట్రంక్ పెట్టెలను ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,మహాత్మ హెల్పింగ్ హాండ్స్ సహకారంతో ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో కొడకండ్ల మార్కెండేయ ఫంక్షన్ హాల్ మాజీ అధ్యక్షులు చెన్న ఉపేందర్,రత్న టెంట్ హౌస్ వెలిశాల బందు రమేష్,కొడకండ్ల అభి పెయింట్స్ ప్రొప్రైటర్ బొల్లి కుమారస్వామి,నాయిని సతీష్ తో పాటు పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ..ఇళ్లలో లేదా కార్యాలయాల్లో ఉపయోగంలో లేని కుర్చీలు,టేబుళ్లు,చెయిర్లు తదితర సామగ్రి ఉంటే ఫౌండేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందిన వెంటనే ఫౌండేషన్ సభ్యులు వాటిని సేకరించి వృద్ధాశ్రమాలు,అనాధ ఆశ్రమాలకు అందజేస్తారని తెలిపారు.ఉపయోగం లేకుండా ఉంచితే వస్తువులు కాలక్రమేణా పాడవుతాయని,అవసరమైన వారికి అందించడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన తమ గురువు గంట రవీందర్ కి అనాధ పిల్లలు మరియు ఆశ్రమ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఆయన సేవాభావం తమకు ప్రేరణగా నిలుస్తోందని వారు అన్నారు.ఈ సేవా కార్యక్రమం అనాధ పిల్లలకు భద్రతతో పాటు స్వాభిమానాన్ని కల్పించే దిశగా ఒక ప్రశంసనీయమైన ముందడుగుగా స్థానికులు అభినందించారు.