ఈ69న్యూస్,అయినవోలు హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని కక్కిరాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య,వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పశు వైద్య శిబిరాలను పాడి రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని,రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.రైతుల ఆర్థిక అభివృద్ధిలో పశుపోషణకు కీలక పాత్ర ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.