వైభవంగా వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు
కందుకూరులో కొలువైన కలియుగ దైవం
500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం”
నైవేద్యం కోసం 368 ఎకరాల భూదానం”
మార్చి 4 వరకు వైభవంగా ఉత్సవాలు”
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల కందుకూరు గ్రామంలో స్వయంభూగ వెలిసిన వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు శుక్రవారం
ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.మండలంలోని కందుకూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంనుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. స్వామి వారి కృప కోసం ఎదురుచూసే భక్తకోటి ఈ వేడుకల కోసం భారీగా తరలి వస్తున్నారు.
ఉత్సవాల విశేషాలు ఇవే..
శుక్రవారం ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆరు రోజులుపాటు సాగే ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టాలు ఇలా ఉన్నాయి:
ఫిబ్రవరి 28: స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
మార్చి 1: అత్యంత వైభవంగా శ్రీవారి కల్యాణ మహోత్సవం.
మార్చి 2: కనులపండువగా రథోత్సవం.
మార్చి 3: దొంగల దీపోత్సవం.
మార్చి 4: పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఆలయ పురాణం.. అద్భుతం!
ఈ ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. పూర్వం తిరుమల వెళ్లలేని భక్తుల తపస్సుకు మెచ్చి, స్వామి వారు స్వప్నంలో కనిపించి ఇక్కడ వెలిశారని ప్రతీతి. స్వామి వారు చెప్పిన చోట తవ్వగా విగ్రహం బయటపడటంతో భక్తులు ఆలయాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే, ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా కొలువై ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారు.
నైవేద్యం కోసం 368 ఎకరాలు
స్వామి వారిపై ఉన్న భక్తితో నాటి పెద్దలు రోజుకో ఎకరంలో పండిన పంటను నైవేద్యంగా సమర్పించేలా ఏకంగా 368 ఎకరాల భూమిని కేటాయించడం విశేషం. ఈ ఆధ్యాత్మిక వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
మీట్ దా దేవాలయ ఈఓ”*
కల్యాణోత్సవాల వేడుకలను పురస్కరించుకొని తెలుగు గళం ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ నిర్వహించిన మీట్ దా దేవాలయ ఈవో కార్యక్రమంలో ఈఓ ప్రతాపురం నారాయణచార్యులు మాట్లాడుతూ భక్తుల కొంగుబంగారం కోరిన కోర్కెలు తీర్చే దైవం వెంకటేశ్వరస్వామి కళ్యాణ వేడుకలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆరు రోజులు పాటు స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా వైభవంగా భక్తుల కన్నుల పండగ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆరు రోజులపాటు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నo. మార్చి 01 తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ వేడుకలు తీరొక్క పుష్పాలతో దేవతామూర్తులను అలంకరించి మేళ తాళాల నడుమ వేదపండితుల మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.