శ్రీ సిద్ధార్థ నర్సింగ్ కళాశాలలో క్యాపింగ్ సెర్మని వేడుకలు
ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్
విశిష్ట అతిథులుగా సింగరేణి ఆసుపత్రి నర్సింగ్ సూపరిడెంట్ శాలిని, ప్రభుత్వ సర్వజన నర్సింగ్ సూపర్డెంట్ కుమారి
కొత్తగూడెం పట్టణం కొత్తగూడ జిల్లా కేంద్రంలో శ్రీ సిద్ధార్థ నర్సింగ్ కళాశాల లో క్యాపింగ్ సెర్మని వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి దారా ఫంక్షన్ హాల్లో శ్రీ సిద్ధార్థ నర్సింగ్ జిఎన్ఎమ్ కళాశాల విద్యార్థుల యొక్క క్యాపిటింగ్ సెర్మనీ వేడుకల లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ తుకారం రాథోడ్ హాజరై విద్యార్థులకు నర్సింగ్ వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని అభివరించారు.
ఈ కోర్సులలో ట్రైనింగ్ చాలా ముఖ్యమని జిఎన్ఎమ్ బిఎస్సి నర్సింగ్ కోర్సులలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఈ కోర్సులను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో అందుబాటులోకి తెచ్చిన శ్రీ సిద్ధార్థ నర్సింగ్ కాలేజీ మేనేజ్మెంట్ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ సూపర్డెంట్ విజయ్ కుమా రి నర్సింగ్ విద్యార్థులకు చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేసే అవకాశం దేవుడు కల్పించాడని ఈ కోర్స్ చదివి చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేసేటప్పుడు సంతృప్తికరమైన జీవితం అని గొప్పగా అనిపిస్తుందని కొనియాడారు.
అలాగే మరొక ముఖ్యఅతిథి సింగరేణి ప్రధాన ఆసుపత్రి నర్సింగ్ సూపర్డెంట్ శాలిని విద్యార్థులకు క్యాపను ధరింపజేసి సంపూర్ణ నర్సుగా జ్యోతి ప్రజలనుతో విద్యార్థులకు నర్సింగ్ ప్లేడ్జి నీ చదివించి ప్రతిజ్ఞ చేయించారు నర్సింగ్ విద్యార్థులు ఓపికతో సహనంతో రోగి పట్ల శ్రద్ధ కలిగి క్రమశిక్షణతో నేర్చుకోవాలని సూచించారు.
ఈ నర్సింగ్ గ్రేడ్ 2 ఆఫీసర్ సత్యవతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మంత్రి పల్లి శ్రీనివాస్ రావు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు అలాగే కళాశాల డైరెక్టర్ ఎస్.ఎన్ మూర్తి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి అభినందించారు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఇనపనూరి పుల్లారావు అధ్యక్షత వహించగా సిద్ధార్థ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బి.పవన్ కుమార్ పాల్గొని విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలియజేశారు అధ్యాపక బృందం సీనియర్ ఉపాధ్యాయులు స్వామి సార్ , కవిత, కవిత ,నవ్య ,మారా, జయలక్ష్మి, చైతన్య మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు