సంక్రాంతి షటిల్ టోర్నమెంట్ ఘనంగా ముగింపు
సంక్రాంతి పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో స్నేహా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది.ఈ టోర్నమెంట్లో ఖమ్మం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా,వరంగల్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు.గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడం,దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన జట్లు ఉత్సాహంగా పోటీపడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.విజేత జట్లకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు మాట్లాడుతూ, గోరి కొత్తపల్లి గ్రామ కీర్తి, ప్రఖ్యాతులే ప్రధాన లక్ష్యంగా స్నేహా యూత్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం వివిధ క్రీడా,సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అసోసియేషన్ ప్రధాన ధ్యేయమని తెలిపారు.ఈ టోర్నమెంట్‌కు గ్రామ మాజీ సర్పంచ్ సుధనబోయిన ఓం ప్రకాష్ తన వంతుగా రూ.8,016 నగదు బహుమతిని అందించగా,ఆవుల మహేందర్ ద్వితీయ బహుమతిగా రూ.4,016 అందించారు.అలాగే సూరం సాంబయ్య క్రీడాకారులకు షీల్డులు, మెమెంటోలు, మెడల్స్ అందించి ప్రోత్సహించారు.మండల నాయకులు మటికె సంతోష్,వనం పోషాలు తమ వంతు ఆర్థిక సహాయంతో పాటు కార్యక్రమానికి అండగా నిలిచినట్లు తెలిపారు.దాతలందరికీ స్నేహా యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రఘుసాల తిరుపతి,వార్డు సభ్యుడు తుమ్మరపల్లి వేణు,నాయకులు తుమ్మరపల్లి ప్రేమాజీ,నిమ్మల రాజు,మరిగిద్దే రాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.