
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమంతో టీపీసీసీ ఆదేశాల మేరకు హన్మకొండ డిసిసి భవన్ నందు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆత్మలోని ఈ ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టే ప్రయత్నంగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది..
ఈ సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు సునీత, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టిసిసిసి ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
ఏఐసీసీ అబ్దర్వర్ శ్రీ నవజ్యోతి పట్నాయక్ మాట్లాడుతూ:
ఈ అభియాన్ ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను (డీసీసీస్) బలోపేతం చేయడం కోసం. జిల్లా అధ్యక్షుల ఎంపిక విధానంలో పారదర్శకత, నిబద్ధత, సామర్థ్యం ఉండేలా పునఃసంఘటనా కార్యక్రమం చేపడుతున్నాం అని ఆయన వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ కార్యకర్తలు, మాజీ పదవిదారులు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, సివిల్ సొసైటీ సభ్యులు,సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా,ఎస్సి, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు నాయకత్వావకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి పౌరుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చునని . వినయంతో, దూరదృష్టితో, ప్రజల సమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను మీరు సూచించండి. పార్టీ పునర్నిర్మాణంలో మీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:ప్రజలలోనుండి ప్రజానాయకులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా చర్చించి, వారి అభిప్రాయాలను టీపీసీసీ మరియు ఏఐసీసీకి పంపుతాం. ఈ విధానంతో పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక. నాయకత్వం ప్రజల అభిప్రాయాలతో, ప్రజల అంగీకారంతో ఎంపిక అవుతుందంటే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం, అని అన్నారు.తరువాత తరువాత సమక్షంలో దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసి, ఏఐసీసీ మరియు టీపీసీసీ అబ్జర్వర్లకు అందజేశారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా (సీక్రెట్‌గా) అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. సేకరించిన అభిప్రాయాలను టీపీసీసీకి సమర్పించనున్నారు..
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.