సకాలంలో జీతాలు రాక సతమతమవుతున్న ఉద్యోగులు
రాష్ట్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు సకాలంలో జీతాలురావడం లేదని సీపీఐ (యం ఎల్)రామచంద్రన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ ఎల్లుట్ల ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆదివారం బాగ్ లింగంపల్లిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలుకాని హామీలు ఇచ్చి పాలనను అస్తవ్య స్థంగా రేవంత్ రెడ్డి పాలన నడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంతనలేని ప్రసంగాలతో అల్లకల్లోలంగా ఆగం చేస్తున్నాడని అన్నాడు. వైద్య వృత్తి అంటే ఎమర్జెన్సీ అలాంటి ఉద్యోగులకు ప్రతి నెల 15 నుడి 26 వరకు కూడా జీతాలు రాకపోవడం చాలా బాధాకరం ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి సమస్యలను సరిచేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు అందరికి *ట్రెజరీ ద్వార ప్రతినెల 1తారీకు నాడే జీతాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షం లో అన్నిశాఖల డాక్టర్లు నర్సింగ్ ఆపీసర్స్ అందులో పనిచేసే అందరూ సిబ్బంది తో కలిసి అన్ని జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వను హెచ్చరిoచారు .