సత్తుపల్లి డిపో నీలాద్రి ఆదాయం రూ 844428
మహాశివరాత్రి సందర్భంగా సత్తుపల్లి డిపో నుండి నీలాద్రి 26 బస్సులు నడపగా 844428 రూపాయలు ఆదాయం వచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 15వ తేదీ ఉదయం నాలుగు గంటల నుండి 16వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం నడిపినట్లు ఆయన వివరించారు. తద్వారా ఈపికె 92.66, ఓ ఆర్142 వచ్చినట్లు ఆయన తెలిపారు. 9113 కిలోమీటర్లు ఆపరేట్ చేసినట్లు ఆయన వివరించారు. గత సంవత్సరం తో పోలిస్తే 26000 అదనంగా ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం ప్రయాణికులు 23,422 మంది ప్రయాణించగా వారిలో 14127 మంది మహాలక్ష్మి స్కీం ద్వారా ప్రయాణించిన మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు.గత సంవత్సరంతో పోలిస్తే 500 మంది ప్రయాణికులు అదనంగా తమ బస్సులలో ప్రయాణించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులను ఆదరించిన ప్రయాణికులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో: అసిస్టెంట్ మేనేజర్ పి ప్రవీణ్ కుమార్, మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి పాల్గొన్నారు.