సత్తెమ్మ తల్లి కోవెల వార్షికోత్సవంలో పాల్గొన్న మట్టా
మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల బీరాపల్లి గ్రామ శివారులో వేంచేసి యున్న శ్రీ సత్తెమ్మ తల్లి కోవెల 10 వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో దయానంద్ పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.దేవాలయానికి రహదారి నుండి వస్తు ప్రజలకు దయానంద్ అభివాదం చేశారు.ఈ కార్యక్రమంలో: వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి,బీరాపల్లి సర్పంచ్ జయరాజు, జయలక్ష్మిపురం సర్పంచ్ గడిపర్తి శ్రీను,శంభునిగూడెం సర్పంచ్ అర్వపల్లి నరసింహారావు, ఉపసర్పంచ్ నాగేంద్ర, సీనియర్ నాయకులు అట్లూరి సత్యనారాయణరెడ్డి,బీరాపల్లి మరియు శంభునిగూడెం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,ఆలయ కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.