సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
జనగామ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న మల్లేష్ అనే ఖైదీ మృతి చెందాడు.సింగరాజుపల్లికి చెందిన మల్లేష్ ఒక కేసులో రిమాండ్లో ఉండగా,శనివారం బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.వెంటనే జైలు అధికారులు అతన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు పంపారు.అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.మల్లేష్ మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సబ్ జైలు ఎదుట ఆందోళన చేపట్టి, “జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణం” అంటూ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.