సమాచార హక్కు పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గా హరిబాబు
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గా గణపారపు హరిబాబు ని నియమిస్తూ సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా గణపారపు హరిబాబు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యత అప్పగించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ మీకు మరియు ఈ సంస్థకు ఎలాంటి అవరోధాలు కలగకుండా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని,సంస్థను ముందుకు తీసుకెళ్తానని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.నన్ను
నియమించి నందులకు
జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ నా ఎన్నికకు సహకరించిన,సెక్రటరీ జనరల్ ధర్మరాజు,రాష్ట్ర కన్వీనర్ కన్నేబోయిన ఉషారాణి కి,ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గాడిపల్లి మధు కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను