సాయిస్పూర్తి కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బి. గంగారం గ్రామంలో గల స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అన్ని విభాగాల విద్యార్థిని విద్యార్థులతో కళాశాల కార్స్పండెంట్ బండి ప్రభాకర్ రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకురి శేషారత్నకుమారి లు సాయిస్పూర్తి సేవా సమితి,జాతీయ సేవా పథకం ల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.సంప్రదాయ పద్ధతిలో రంగు రంగుల హరివిల్లులు దిద్దారు.భోగి మంటలు వేశారు,పిండి వంటలు చేశారు.వర్చువల్ గా ఎంపీ బండి పార్థసారథిరెడ్డి,బండి సంవిధ లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.