సినీ హీరో శివాజీ వ్యాఖ్యల్లో తప్పులేదు మాజీ సర్పంచ్ నవ్య
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ మాజీ సర్పంచ్ నవ్య సినీ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు.సమాజంలో మహిళలు ధరించే వస్త్రధారణపై శివాజీ వ్యక్తపరిచిన అభిప్రాయాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుత తరంలో కొంతమంది యువతులు సంప్రదాయాన్ని విస్మరించి అతి స్వేచ్ఛగా,అసభ్యంగా దుస్తులు ధరించడం సమాజానికి సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.ఆడదంటే గౌరవం,మర్యాద కలిగిన దేవతలా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు.సమాజంలో అతి చిన్నదైన దుస్తులు ధరించడం వల్ల కొందరు కామాంధులు చెడు దృష్టితో చూడటం,దురాలోచనలకు పాల్పడే అవకాశం పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితులకు బాధ్యతాయుతమైన ఆలోచన అవసరమని తెలిపారు.శివాజీ తన వ్యాఖ్యలపై ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని,ఆయన చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పిదం లేదని నవ్య స్పష్టం చేశారు.శివాజీపై అనవసరంగా ఒత్తిడి తెచ్చినా,ఇబ్బంది పెట్టినా తామంతా ఆయనకు అండగా నిలుస్తామని వెల్లడించారు