సిపిఐ శతజయంతి మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామంలో సిపిఐ పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశానికి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి రావుల సదానంద్ ముఖ్య అతిథిగా హాజరై,పార్టీ 100 సంవత్సరాల శతజయంతి సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న మహాసభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రావుల సదానంద్ మాట్లాడుతూ..వంద సంవత్సరాల సిపిఐ పోరాట చరిత్ర దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనతను కలిగి ఉందన్నారు.భూమికోసం,భూమి హక్కుల కోసం,వెట్టి చాకిరీ విముక్తి కోసం,స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు సిపిఐ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ వచ్చిందన్నారు.ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఇప్పటికీ అదే సంకల్పంతో ముందుకు సాగుతోందని,ఇదే ఎర్రజెండా సిపిఐ ప్రత్యేకత అని పేర్కొన్నారు.ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న శతజయంతి మహాసభకు మండల వ్యాప్తంగా సిపిఐ నాయకులు,కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కౌడ వెంకన్న,గజరాజు సిద్ధులు,బాధ బిక్షపతి,గవ్వల అబ్బ సాయిలు,జుట్ట ఐలయ్య,ఆసర్ల సోమయ్య,దాసరి వెంకన్న,పద్మ,జిట్ట రాములు తదితరులు పాల్గొన్నారు.