సిరులు విరజిల్లిన తెలంగాణ..! నాటి సొగసేది
పంచ కర్మలకు ప్రాధాన్యత పెంచండి
కళాకారుల త్యాగాలకు విలువనివ్వండి
భగవంతుడొక్కడే… అన్న సత్యత్వంతో సమైక్యమౌదాం
మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటుదాం
— విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య
త్రిలింగ అన్న పదములో నుంచి పుట్టిన తెలుగు “దేశ భాష లందు తెలుగు లెస్స” అన్న స్థాయిలో కీర్తించబడిందని, తెలంగాణ ప్రాంతంలోని ఏకశిలా నగరాన్ని (ఓరుగల్లును) రాజధానిగా చేసుకుని పాలించిన కాకతీయులు చరిత్రకారులై భావితరాల నవఒరవడికి నాంది పలికారని పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య అన్నారు.హనుమకొండ టిఎన్జిఓయస్ భవన్ లో శనివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలుగు వెలుగు సాహితీ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు డా. పొడి శెట్టి విష్ణువర్ధన్ అధ్యక్షతవహించిన ఈ కార్యక్రమానికి డా. శాంతి కృష్ణ ఆచార్య ముఖ్య అతిధిగా విచ్చే ప్రసంగించారు.ఈ సందర్బంగా డా. ఆచార్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ముందున్నది విశ్వకర్మలేనని, ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ప్రజలను సమైక్యపరిచింది కళాకారులేనని కానీ ఈ ఇరువురికి రాష్ట్రంలో ఆదరణ, ప్రోత్సాహం కరువైందన్నారు, పంచకర్మలైన విశ్వకర్మలకు కాకతీయులు సముచితమైన ప్రత్యేక స్థానాన్ని కల్పించారని, ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మలు శిల్పకళలతో నిర్మించిన అన్ని దేవాలయాలు, శిల్ప కళాఖండాలే నేడు సనాతన ధర్మానికి, సనాతన సంస్కృతికి సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయన్నారు.నాడు సిరులు విరజిల్లుతూ…. కళలకు ఖానాచిగా ఉన్న తెలంగాణ నేడు విశ్వకర్మలకు, కళాకారులకు సరియైన గుర్తింపు నివ్వక విలవిలలాడుతుందన్నారు, ప్రపంచం ఎంత ఆధునీకరణమైన కళాకారుల ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకురాగలుగుతామన్నారు ఇది ప్రభుత్వాలు విస్మరించకుండా కళాకారులకు సరైన విలువలను ఇచ్చి వారి సేవలను జన చైతన్యానికి వినియోగించుకోవాలని అలాంటి ప్రభుత్వాలే చరిత్రలో స్థిరంగా మిగులుతాయన్నారు
ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ భారతీయ సనాతన ధర్మమే గొప్పదని, మన భూమిపై మానవ మనుగడ ఏర్పడి సుమారు లక్ష సంవత్సరాలు అయినప్పటికీ మానవుడికి నాగరికతను నేర్పి మానవ మనుగడకు మార్గదర్శక మైనది భారతీయ సంస్కృతికి చెందిన విశ్వకర్మ జాతీయులు మాత్రమేనని, పంచ వేదములు పుట్టిన నేల కూడా భారతదేశమేనని కనుక మన జాతిని, మన జాతీయులను విస్మరించరాదని, ప్రపంచంలో ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నప్పటికీ మానవత్వం ఒకటేనని, భగవంతుడు ఒక్కడే విరాట్ విశ్వకర్మ పరమాత్మ అన్న వాస్తవికసత్యాన్ని విశ్వవ్యాప్తం గావించాలని, అన్ని మతాల సారాంశం కూడా ఇదే సత్యత్వాన్ని చాటుతున్నాయని డా. ఆచార్య అన్నారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్ మన దేశ సమగ్ర సమైక్యతను చాటుతూ వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహోన్నత వ్యక్తులను గుర్తించి వారికి జాతీయస్థాయిలో పురస్కారాలు అందజేయడం ద్వారా వారిలో మరింత చైతన్యం కలుగుతుందని తద్వారా వారు చేస్తున్న సేవలు భావితరాలకు మార్గదర్శకమై మానవత్వం మరింత వికసిస్తుందని డా. ఆచార్య అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ జగత్మమునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి వారు జ్యోతి ప్రజ్వలన గావించగా తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమరాచార్యులు, సభాధ్యక్షులు వహించిన డా. పొడి శెట్టి విష్ణువర్ధన్ ఆచార్య, మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. వనపర్తి పద్మావతి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చెల్లేటి కృష్ణమాచారి, తెలుగు వెలుగు జాతీయ ప్రధాన కార్యదర్శి డా. వలభోజ మోహన్ రావు, వరంగల్ ఉమ్మడి జిల్లా విఓపిఏ అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజారావు, తారక కమ్మవారి కళ్యాణ వేదిక వ్యవస్థాపకులు మన్నె నాగమల్లేశ్వరి, భద్రకాళి దేవాలయ పూర్వ ఈవో శేషు భారతి, కాసుల కిరణ్ కుమార్, వేముల తిరుపతిరెడ్డి, వేములవాడ రాధిక, పెద్దపల్లి స్పందన, సంఘ శ్రీధర్, అడ్లూరి వెంకటేశ్వర్లు, బాణాల రాజు, జొనాగోని యాదగిరి గౌడ్ తో పాటు దేశ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు ప్రజలు హాజరయ్యారు.ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుండి సుమారు 120 మంది వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయ గౌరవ పురస్కారాలతో సత్కరించారు.