సి.పి.ఆర్.తోగుండె కు రక్షణ
గుండెపోటు వచ్చిన వ్యక్తులను రక్షించేందుకు సి.పి.ఆర్.పై ప్రతి ఒక్కరూ శిక్షణ పొందాలని
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశపు హల్ లో జాతీయ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సి.పి.ఆర్.కార్యక్రమం పై అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్,(రెవెన్యూ) బెన్ షాలోమ్ లతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జాతీయస్థాయిలో చేపట్టిన సి.పి.ఆర్.శిక్షణ కార్యక్రమం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు.ఆకస్మికంగా గుండె పోటు కు గురైన వారిని సి.పి.ఆర్.తో ఏ విధంగా రక్షించుకోవచ్చునో సంబంధిత శిక్షకులు జిల్లా అధికారులకు ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ శిక్షణ ఇచ్చారు.అనంతరం కలెక్టర్ సి.పి.ఆర్.పై అధికారులు,సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గోపి రామ్,డిఎస్ వెంకన్న,డిఆర్డిఓ వసంత,జిల్లా వైద్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు ,సిపిఆర్ శిక్షకులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.