సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్
Mahabubabadఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మరిపెడలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈమేరకు ప్రాంగణాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సోమవారం పరిశీలించారు. ప్రాంగణంలో సభా వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.పోరాడి సాధించుకున్న రాష్ట్రం లో తొమ్మిదిన్నరేళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలో జరిగిన ప్రగతి కళ్లముందు కనిపిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ను చూసేందుకు, వారి ప్రసంగాన్ని వినేందుకు పార్టీ శ్రేణులతోపాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని అన్నారు. సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి బీ ఆర్ ఎస్ అభ్యర్ధి రెడ్యా నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.రేపటి సీఎం కేసీఆర్ సభకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సభాస్థలికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కుడితి మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.