సీపీఎం సర్పంచ్ అభ్యర్థి అనిల్‌ను గెలిపించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కపల్లిగూడెం గ్రామంలో సీపీఎం-కాంగ్రెస్ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బొమ్మగళ్ళ అనిల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ పిలుపునిచ్చారు.మండల పరిధిలోని అక్కపల్లిగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల సమావేశం కడుదుల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం,గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సీపీఎం పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు.గత ఐదేళ్లుగా అక్కపల్లిగూడెంలో సీపీఎం తరఫున సర్పంచ్‌గా కొనసాగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత పార్టీకి దక్కుతుందని తెలిపారు.నిస్వార్థంగా గ్రామాభివృద్ధికి సేవలందించే సీపీఎం సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు.గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి బొమ్మగళ్ళ అనిల్ విజయం సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు,మండల కార్యదర్శి మునిగేల రమేష్,సర్పంచ్ అభ్యర్థి బొమ్మగళ్ళ అనిల్,మండల కమిటీ సభ్యులు ఐలయ్య, యార మోహన్,పార్టీ గ్రామ నాయకులు అనుముల ఎల్లయ్య, కూస అశోక్ తదితరులు పాల్గొన్నారు.