తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి
నూతనకల్: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని శిల్పకుంట్ల గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కీపాస్ కిసాన్ యాప్ అమలు వెనుక తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ విక్రయాలు కు అవకాశం కల్పించాలన్నారు. పత్తి దిగుమతి పై ఉన్న 11% సుఖాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటాపత్తికి రూ.10.075 ధర నిర్ణయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు బాధ్యత నుండి తప్పుకోవడానికి ధరల వ్యత్యాసం పథకం రూపొందించిందఅన్నారు. పత్తి క్వింటాలకు రూ. 475 బోనస్ చెల్లించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో వరి కోతలు ప్రారంభమై 20 రోజులు అవుతున్న ప్రభుత్వం ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే అన్ని గ్రామాలలో ఐకెపి ప్రారంభించాలన్నారు. కాంటాలు వేసిన వరి ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి రైతాంగం ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఐకెపిలో కొనుగోలు చేసిన వరి ధాన్యానికి వెంటనే బిల్లులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ వాటాదనం కల్పించి చిన్న, సన్న కారు రైతులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. ధనిక రైతులకు ఉపయోగపడే విధంగా నూతన సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు.తెలంగాణ రైతు సంఘంగ్రామ శాఖ మహాసభ సందర్భంగా అంతకుముందు రైతు సంఘం జెండాను ఆ సంఘం సీనియర్ నాయకులు పులుసు లింగయ్య ఆవిష్కరించారు. రైతు సంఘం గ్రామ అధ్యక్షులుగా సామ సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పుల పరమేష్ లతో పాటు మరో 11 మందితో నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి కుసు సైదులు, నాయకులు బొజ్జ శ్రీను, గజ్జల శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, అనంతుల రాఘవులు, బత్తుల తిరుమలేష్, తొట్ల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.