సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఈ69న్యూస్ ఈదులగూడెం,(E69 న్యూస్ రిపోర్టర్ కుకూట్ల వరుణ్) కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈదులగూడెం విగ్రహానికి నివాళులు అర్పించారు.పార్టీ జెండాను సీనియర్ నేతలు ఆవిష్కరించగా, భారీ బైక్ ర్యాలీ మరియు రక్తదాన శిబిరం నిర్వహించబడింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ,సుందరయ్య తన జీవితమంతా పేదల కోసం త్యాగాలు,పోరాటాలు చేశారని అన్నారు.కమ్యూనిస్టులకు ఓట్లు,సీట్లు కాదు,ప్రజల హక్కులే ముఖ్యమని జ్యోతి హాస్పిటల్ డాక్టర్ మువ్వ రామారావు తెలిపారు.పలువురు సిపిఎం నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.