అరుణ ప్రభ న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సూరారం గ్రామ సర్పంచ్ పదవికి దళితులకు రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ గ్రామ దళితులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ని సూరారం గ్రామ ప్రజలు కలిశారు.ఈ సందర్భంగా కాసర్ల రాజు తాజా మాజీ వార్డు సభ్యుడు మాట్లాడుతూ..గత 40 ఏళ్లుగా సూరారం పంచాయతీలో దళితులకు సర్పంచ్ పదవి రాలేదు.ఇప్పటికైనా ఆ న్యాయం జరిగేలా చూడాలి అని కోరారు.గ్రామ ప్రజల వినతిపత్రాన్ని పరిశీలించిన మంద కృష్ణ మాదిగ,వెంటనే జనగామ జిల్లా ఎంఆర్పిఎస్ ఇంచార్జీకి కాల్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.నేను నా సంతకంతో లెటర్ పంపిస్తున్నా,మీరు కలెక్టర్ ని వెంటనే కలవండి.నేను కూడా ఫోన్ ద్వారా కలెక్టర్ తో మాట్లాడుతాను,అని హామీ ఇచ్చారని ఇటువంటి చర్యలతో సూరారం గ్రామ దళితులకు రిజర్వేషన్ సాధనలో ముందడుగు పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.