సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదు
మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్ అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్యఅతిథిగా హాజరనా మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్,సైన్స్ ఎగ్జిబిట్లను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవాళికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని సైన్స్ లేనిదే మానవ మనుగడ కష్టమని ఆధునిక కాలంలో మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని శాస్త్రీయ సాంకేతిక రంగంలో విద్యార్థులు ముందు భాగంలో ఉండాలని కరోనా లాంటి కష్ట కాలంలో కూడా సైన్స్ ఒకటే సమాజాన్ని కాపాడిందని మన భారతదేశం శాస్త్రీయ రంగంలో అభివృద్ధికి విద్యార్థుల యొక్క పాత్ర చాలా గొప్పదని అన్నారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదువుకొని లక్ష్యాలను దరి చేరాలని అన్నారు సి.వి రామన్ కృషి వల్ల నేడు సైన్సు అభివృద్ధి జరిగిందన్నారు సి.వి రామన్ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి భారతదేశాన్ని శాస్త్రీయ రంగంలో ముందు ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రీనా గోపికృష్ణ, రజితమాధవ్, కమ్మగాని కృష్ణమూర్తి గౌడ్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.