మండల కేంద్రనికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉపసర్పంచ్. రావుల వెంకటరెడ్డి సీనియర్ నాయకులు మాచర్ల రవీందర్ రావు,రావుల అజిత్ రెడ్డి ,కొంతం రాములు తో పాటు వైయస్సార్ టిపీనుండీ టేకుమట్ల విష్ణు రావుల అనీల్ రెడ్డి ల నాయకత్వంలో 40 మంది నాయకులు ఈరోజు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో పార్టీలో చేరారువీరికి సింగపురం ఇందిరా గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సందర్భంగా రావుల వెంకటరెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి వేసిందని , కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నీరు పేదలందరికీ ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గృహకల్ప పేరు ఆనాడే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గారి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు