
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 15
జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గ సభ్యుడు వడ్లకొండ సుధాకర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మండల కార్యదర్శి జువారి రమేష్ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 16, 2026 సోమవారం రోజున మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, ఆ యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న గ్యాస్ ధరలు మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికా–ఇజ్రాయిల్ అనుకూల విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ, వాటిని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ ధర్నాను విజయవంతం చేయడానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శి పెండ్యాల సమ్మయ్య, మహిళా సమాఖ్య నాయకురాలు ఎం.డి. నూర్నిషా, పార్టీ నాయకులు పెద్ద రాములు, మంద బుచ్చయ్య, అన్నెపు అజయ్, బుల్లె సాయిలు, కలకోటి యాదగిరి, అన్నెపు విష్ణు తదితరులు పాల్గొన్నారు.