స్టేషన్గన్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ కు భారీ బైక్ ర్యాలీతో ,డప్పు వాయిద్యాలతో, బోనాలతో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర మరియు తీన్మార్ మల్లన్న
Uncategorizedఅనంతరం కార్యక్రమాలు ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు నియోజకవర్గ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఈ పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో పేద మరియు మధ్య తరగతి ప్రజలకు చేసింది ఏమీ లేదు కేవలం బడా నాయకులకు భూస్వాములకు పెత్తందారులకు మధ్య భక్తులకే పట్టం కట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఏ క్రమంలో ఎకరాలు రైతులకు మిగిలేది ఏమీ లేదు వందల ఎకరాలు ఉన్నటువంటి భూసాములు మళ్లీ వంద ఎకరాలు భూమిని కొనుగోలు చేస్తున్నారు కానీ ఎకరం రెండు ఏకురాల రైతులు ఇప్పటివరకు కూడా ఒక ఎకరం కూడా దాఖలు లేవు. గ్రామాలలో విద్యా వైద్యాన్ని దూరం చేసి మద్యాన్ని అలవాటు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని తెలియజేయడం జరిగినది
అనంతరం కార్యక్రమం ముఖ్య అతిథి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ
స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆనాడు నేను పట్టభద్రుల లో పోటీ చేసినప్పుడు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈనాడు తెలంగాణలో ఈ ఎన్నికలు ఆత్మ గౌరవానికి ఆత్మవంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం రెండుసార్లు కేసీఆర్ మోసపూరి మాటలు నమ్మి ప్రజలు పట్టం కట్టిన కూడా ఆ ప్రజలకు ఒరిగే పెట్టింది ఏమీ లేదు
నీళ్లు అని పేరు చెప్పి లక్షల కోట్లతో కట్టిన కాలేశ్వరం మూడు సంవత్సరాలలోనే కను మార్గమే అయిపోయే పరిస్థితి ఏర్పడినది ఇక నియమకలు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా అందులో పేపర్ లీకేజీలు మరియు సరేనా సమయంలో నోటిఫికేషన్ వేయక ఉద్యోగాలు వస్తే ఆశతో కోచింగ్‌ల సెంటర్ల చుట్టూ తిరుగుతున్న దుస్థితి ఈ తెలంగాణలోని నిరుద్యోగులది
నిధులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులకు నిధులు కేటాయించలేక బిక్షటన చేసినటువంటి దుస్థితిని కూడా చూశాము యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పి ఒకదాఫా చేసి మిగతా మూడుసార్లు మొండి చెయ్యి చూపిన ఘనత కేసీఆర్
దళిత బంధు పేరు చెప్పి అందరి దళితుల కుటుంబాల్లో దీపాలు నింపుతానని చెప్పి కేవలం కమిషన్లు తీసుకొని అందులో ఊరికి ఒకరికో ఇద్దరికో మాత్రమే దళిత బంధించి మిగతావారునీ మోసం చేసిన కేసీఆర్ ఇక్కడ అభ్యర్థి కడియం శ్రీహరి టికెట్ ఎలా వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగిన సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు కడియం శ్రీహరి కేసీఆర్ భజన చేసరే తప్ప అంశాల పైన విన్నవించినా కూడా అది చిన్న విషయమని కొట్టిపారేసిన కేసీఆర్ విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా డిగ్రీ కాలేజీ కూడా తీసుకురానీ దుస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థినీ గెలిపించుకుంటారా లేక మీయొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే పరితపించే ఇందిరక్కని గెలిపించుకుంటారా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేయడం జరిగినది
కెసిఆర్ మూడోసారి అధికారులకు వస్తే తెల్ల రేషన్ కార్డులను కూడా ఎత్తివేసి మీకు రావాల్సినటువంటి గ్యాస్ సబ్సిడీ గాని ఎరువులపై గాని కుట్ర చేస్తున్నాడు అని అది మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం కావున ఇందిరక్కకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు యువజన నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు